Telangana
- Dec 23, 2020 , 10:18:15
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్ల సూచనమేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత వారం రోజుల్లో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదవగా, మరో నలుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,982కు చేరగా, 1522 మంది మరణించారు. మరో 2,74,833 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇందులో గత 24 గంటల్లో 573 మంది మహమ్మారి బారినుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో 6627 యాక్టివ్ కేసులు ఉండగా, 4467 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING