ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 12:16:09

క్షేత్రస్థాయి సిబ్బందికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాస్కుల పంపిణీ

క్షేత్రస్థాయి సిబ్బందికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాస్కుల పంపిణీ

వికారాబాద్‌ : జిల్లాలోని కొడంగల్‌ మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, మీడియా సిబ్బందికి శానిటేషన్‌, మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నిబంధనలు అందరూ తప్పక పాటించాలన్నారు. వలస కూలీలు, రేషన్‌కార్డు లేని వారిని గుర్తించి బియ్యం, నగదు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ పౌసమీ బసును కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వానికి సహరిస్తూ ఏప్రిల్‌ 15 వరకు ఇండ్లకే పరిమితం కావాలని పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo