ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 22:33:29

రేపు ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

రేపు ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ :  నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను గురువారం స్వగ్రామం పాలెంలోని వ్యవసాయ క్షేతంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.  

సీఎం షెడ్యూల్‌ ఇలా.. 

10 గంటల 50 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరి 10 గంటల 55 నిమిషాలకు బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.

11 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 11 గంటల 25 నిమిషాలకు పాలెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలు ముగిసే వరకు ఉంటారు. 

12 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై 12 గంటల 30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.