మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 09:54:47

నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విస్తృత పర్యటన

నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విస్తృత పర్యటన

నాగర్‌కర్నూల్‌ : లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన భాగంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఈ ఉదయం నాగర్‌ కర్నూల్‌ పట్టణంలో బైక్‌పై విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని 10వ వార్డులో రేషన్‌ దుకాణం వద్ద ప్రజలు గుంపులుగా ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వారివద్దకు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యాన్ని వివరించారు. వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. 

దుకాణాదారులకు పలు సూచనలు చేశారు. నీళ్లు, సబ్బు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రేషన్‌తో పాటు లబ్దిదారులకు ప్రభుత్వం త్వరలోనే రూ.1500 వారి బ్యాంక్‌ అకౌంట్లో వేస్తుందన్నారు. లాక్‌డైన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ప్రజలెవరూ ఇంట్లో నుండి బయటకు రావొద్దన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, పలువురు అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.


logo
>>>>>>