గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 17:55:48

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా

నిజామాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా  బిగాల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నిజామాబాద్ నగరంలో చేపడుతున్న పట్టణీకరణ పనులను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధిని కండ్లకు కట్టారు. పురపాలక శాఖ ద్వారా నగరాలకు, పట్టణాలకు పుష్కలంగా నిధులు మంజూరు అవుతున్న నేపథ్యంలో గతం కంటే మిన్నగా నిజామాబాద్ నగరం కొత్త సొబగులు అద్దుకుందని ఎమ్మెల్యే వివరించారు. రానున్న రోజుల్లో నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.