శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 18, 2020 , 01:45:20

బడి కోసం 70 లక్షల విరాళం

బడి కోసం 70 లక్షల విరాళం
  • ఉదారత చాటుకొన్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌

బాలానగర్‌: శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవన పునర్నిర్మాణానికి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ భూరి విరాళం అందజేశారు. నిర్మాణపనులు చేపట్టేందుకు తన జేబు నుంచి రూ.70 లక్షలు అందజేసి ఉదారత చాటుకొన్నారు.  బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొన్నది. పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించే పనులకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీనగర్‌లో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ను కోరగా.. సానుకూలంగా స్పందించి రూ.70 లక్షలు కేటాయించడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకొంటున్న సాహసోపేతమైన నిర్ణయాలకు తాను కూడా కట్టుబడి ఉన్నానని చెప్పారు. 


logo