శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 16:01:38

ఎమ్మెల్యే క్రాంతి జోక్యంతో బాటసారులకు తప్పిన అవస్థలు

ఎమ్మెల్యే క్రాంతి జోక్యంతో బాటసారులకు తప్పిన అవస్థలు

హైదరాబాద్‌ : అందోల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ జోక్యంతో బాటసారులకు అవస్థలు తప్పాయి. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం నుంచి అనేకమంది స్వస్థలాల బాట పట్టారు. ఈ క్రమంలో చౌటకూర్‌ జాతీయ రహదారి ప్రక్కన పలువురు వ్యక్తులు గుంపులుగా కూర్చొన్నది ఎమ్మెల్యే క్రాంతి గమనించారు. వారివద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. దానికి అక్కడున్నవారు తాము హైదరాబాద్‌ నుంచి వస్తున్నట్లు.. నారాయణఖేడ్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా స్పందించడంతో కాలినడకన వెళ్తున్నట్లు చెప్పారు. తినేందుకు ఆహారం సైతం దొరకక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారికి ఓ వాహనాన్ని సమకూర్చారు. అదేవిధంగా జోగిపేట్‌లో వాళ్లకు ఆహారం అందేలా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు.

logo