శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 12:38:40

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్‌, ఎమ్మెల్సీలు

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్‌, ఎమ్మెల్సీలు

తిరుమల: కుత్‌బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్ తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల వ‌చ్చిన ఆయ‌న ఈరోజు ఉద‌యం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట మ‌ండ‌లిలో ప్ర‌భుత్వ విప్ ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు. అనంత‌రం రంగనాయకుల మండ‌పంలో వేద పండితులు వారిని ఆశీర్వ‌దించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాల‌తో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాల‌ని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. జీహెచ్ఎమ్మెస్సీ ఎన్నికల్లో అఖండమైన విజయం సాధిస్తామ‌ని, వంద స్థానాల్లో గెలుపొందుతామ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథ‌కాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.