గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:36:11

మాంద్యం ఉన్నా కోతల్లేవు

మాంద్యం ఉన్నా కోతల్లేవు
  • సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌
  • ముఖ్యమంత్రి అపర భగీరథుడు: ఎమ్మెల్యే వివేకానంద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పథకాల్లో ఎక్కడా కూడా కోత పెట్టలేదన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. మిషన్‌భగీరథ నీటిని తాగడంతో నల్లగొండ జిల్లాలో ఆరేండ్లుగా ఒక్క ఫ్లోరైడ్‌ కేసు కూడా నమోదుకాలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అపర భగీరథుడని కొనియాడారు. 


logo