ప్రముఖ నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మరణం చాలామందికి షాకింగ్ కు గురి చేసిన విషయం తెలిసిందే. తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉండే మందిరా ఇప్పుడు ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అయితే రాజ్ కౌశల్ మరణానికి చిన్న పొరపాటే కారణం అని సంగీత దర్శకుడు సులేమాన్ మర్చంట్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
రాజ్‌కి 30-32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకుంటా.. ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. చనిపోయే ముందు రోజు సాయంత్రం నీరసంగా కనిపించాడు. మధ్య రాత్రి గుండె నొప్పి ఎక్కువగా వచ్చింది. తెల్లవారుఝామున పరిస్థితి విషమించింది. ఒకసారి గుండెనొప్పి వచ్చిన హిస్టరీ ఉన్నప్పుడు.. వాయువేగంతో ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో కౌశల్ చేసిన పొరపాటు అతడి ప్రాణాలు పోవటానికి కారణమైందని చెప్పక తప్పదు అని సులేమాన్ అన్నారు.