మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 12:09:20

ప్రలోభాలకు పాల్పడదామని అభ్యర్థిని దింపారా? : జీవన్‌ రెడ్డి

ప్రలోభాలకు పాల్పడదామని అభ్యర్థిని దింపారా? : జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌ : దేశంలో ఫిరాయింపులకు కర్త, కర్మ, క్రియ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ఇరుపార్టీల నేతలు చేస్తున్న కామెంట్లపై జీవన్‌రెడ్డి నేడు మాట్లాడారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కవిత గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్నారు. మొత్తం 824 మంది ఓటర్లలో తమకు 80 శాతం సభ్యుల బలం ఉందన్నారు. బలం లేకున్నా కాంగ్రెస్‌, బీజేపీ లు అభ్యర్థులను దించి ఎన్నికల కమిషన్‌కు పోటాపోటి ఫిర్యాదులు ఇస్తున్నాయన్నారు. అనేక రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్‌, బీజేపీలదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఫాదర్‌ ఆఫ్‌ డెఫెక్షన్‌ అని పిలువొచ్చన్నారు. ఏ సమస్య లేనిచోట సమస్యను సృష్టించి వార్తల్లోకి ఎక్కాలన్నదే వారి ఆరాటం తప్ప మరొకటి కాదన్నారు. అసలు తగినంత సంఖ్యాబలం లేకున్నా అభ్యర్థిని ఎందుకు దింపిందో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలన్నారు. ప్రలోభాలకు పాల్పడదామనే అభ్యర్థిని దింపారా సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.logo