సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 00:56:51

సంజయ్‌వి మితిమీరిన మాటలు

సంజయ్‌వి మితిమీరిన మాటలు
  • ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి గంటలు కూడా గడవకముందే బండి సంజ య్‌ మితిమీరి మాట్లాడుతున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయిం ట్‌ వద్ద మాట్లాడుతూ.. బీజేపీకి తెలంగాణ ప్రజలెప్పుడో గోరీ కట్టారని, సంజయ్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంజయ్‌ వయసు సీఎం కేసీఆర్‌ రాజకీయ అనుభవమంత లేదని ఎద్దేవాచేశారు. 


logo