బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 11:00:53

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సురేందర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సురేందర్

హైదరాబాద్ : తిరుమల‌ శ్రీవారిని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు టీటీడీ మాజీ జేఈవో, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కే.ఎస్ శ్రీనివాస రాజు  స్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీరు స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఎమ్మెల్యేకు వేద పండితులు వేద ఆశీర్వాచనం చేయగా..టీటీడీ ఆలయ అధికారులు పట్టువస్త్రాలను, తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి ప్రసాదించాలని స్వామి ప్రార్థించినట్లు తెలిపారు.


logo