మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 15:11:17

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. ధరూర్,కె.టి దొడ్డి మండలంలోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం, తదితర గ్రామాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో వర్షపు నీరు చేరకుండా యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరమ‌న్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునే అన్ని అవకాశాలను పరిశీలించి, రైతులను ఆదుకుంటామ‌ని భరోసానిచ్చారు. నీటి మునిగిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి  ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.

logo