గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 21:12:20

ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా

ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా

పాల్వంచ: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ పిలుపునకు ప్రజలందరూ సహకరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న తన మనుమరాలి వివాహ మహోత్సవాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఆయన స్వగృహంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌ను బాధ్యతగా భావించి ప్రజలు సహకరించాలన్నారు. 30 ఏళ్ల తరువాత తమ ఇంట్లో శుభకార్యం జరుగనుండగా నిలిపివేశామన్నారు. అధికారులు, మంత్రులు, సీఎం కేసీఆర్‌తో పాటు వేలాది మందిని వివాహానికి ఆహ్వానించామని, అన్ని సమకూర్చుకుని ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.logo