మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:18:42

కేసీఆర్‌ రైతుబంధు!

కేసీఆర్‌ రైతుబంధు!
  • పథకం పేరు మార్చాలని సూచించిన ఎమ్మెల్యే గండ్ర

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్‌ నిలిచారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సాయంచేసే రైతుబంధు పథకం పేరును ‘కేసీఆర్‌ రైతుబంధు’గా మార్చాలని ఆయన సూచించారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై చర్చను గండ్ర ప్రారంభించారు. కాకతీయ కాల్వ ఆయకట్టుకు 31 ఏండ్లలో ఎన్నడూ నీళ్లు రాలేదని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాల్వల్లో 150 రోజులు నీళ్లు పారుతున్నాయని చెప్పారు.  అంతకుముందు ఇటీవల మరణించిన ఎనిమిదిమం ది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. 


జంట జలాశయాల పరిరక్షణ: భట్టి 

హైదరాబాద్‌కు తాగునీటిని అందించే జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సూచించారు. బుధవారం బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న భట్టి.. రాష్ట్రప్రభుత్వం మిషన్‌ కాకతీయ కింద వేల చెరువులను పునరుద్ధరించిందని చెప్పారు. 


logo