మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 15:17:42

సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచి : ఎమ్మెల్యే గండ్ర‌

సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచి : ఎమ్మెల్యే గండ్ర‌

హైద‌రాబాద్ : రైతుల సంక్షేమ కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ స‌మాజ‌మే కాదు.. యావ‌త్ భార‌త‌దేశం హ‌ర్షిస్తోంది అని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు దేశానికి దిక్సూచిగా ఉన్నాయ‌న్నారు. ఈ చ‌ట్టం దేశానికి త‌ల‌మానికంగా మారుతుంద‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల‌కు మేలు చేసేందుకు కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఈ బిల్లును తీసుకురావ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. టీఆర్ఎస్ పాల‌న‌లో రైతులంతా సుభిక్షంగా ఉన్నారు.

పేద‌, స‌న్న‌కారు రైతుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేశారు. రెవెన్యూ అధికారుల్లో కొంద‌రు అవినీతికి పాల్ప‌డుతున్నారు. రెవెన్యూ అధికారులు ప్ర‌జ‌ల‌ను అయోమ‌యం చేస్తున్నారు. కోట్ల రూపాయాలు లంచం డిమాండ్ చేస్తూ రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నారు. వీట‌న్నింటికి చెక్ పెట్టేందుకు క్షేత్ర స్థాయిలో అధ్య‌య‌నం చేసి ఈ చ‌ట్టానికి సీఎం కేసీఆర్ రూప‌క‌ల్ప‌న చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. ఎస్సీల‌కు సంబంధించిన ప‌ట్టాల‌ను ఇవ్వాలి. రాష్ర్టంలో ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌వ‌సాయంపై దృష్టి కేంద్రీక‌రించారు. అసైన్డ్ భూముల హ‌క్కుల‌కు సంబంధించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ చ‌ట్టం ద్వారా పేద వ‌ర్గాల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి అన్నారు. 


logo