ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 16:07:59

గచ్చిబౌలి డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ

గచ్చిబౌలి డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ

హైదరాబాద్ : గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబాలు పర్యటించారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి నిండిన ఖాజాగూడ ఎక్స్‌ రోడ్డు వద్ద ఉన్న నాలాను వారు పరిశీలించారు. 

అలాగే డివిజన్‌ పరిధిలోని పంచవటి కాలనీ, సాయివైభవ్‌ కాలనీల్లోనూ వారు పర్యటించారు. భారీ వర్షంతో ఆయా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో తగిన సహాయ చర్యలు చేపట్టాలని వారు అధికారులకు సూచించారు. వారి వెంట జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్‌, ఏఈ కృష్ణవేణి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.logo