శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:53

సర్కార్‌ దవాఖానకు ఎమ్మెల్యే

 సర్కార్‌ దవాఖానకు ఎమ్మెల్యే

  • కొడుకుకు వైద్యం చేయించిన చిరుమర్తి లింగయ్య

నీలగిరి: ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తిలా సర్కార్‌ దవాఖానకు వెళ్లి తన కుమారుడికి వైద్యం చేయించారు నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సోమవారం తన కుమారుడు అస్వస్థతకు గురికాగా ఆయన నల్లగొండ జిల్లాకేంద్ర దవాఖానకు తీసుకొచ్చారు. సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓపీ చీటి రాయించుకుని డాక్టర్‌ను సంప్రదించారు. డ్యూటీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఎమ్మెల్యేను గుర్తించి సత్వరమే వైద్య పరీక్షలు చేసి పంపించారు. సర్కార్‌ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యేకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని, ప్రజలకు సర్కార్‌ దవాఖానలపై మరింత నమ్మకం కలిగించడానికే తాను ఇలా వచ్చినట్లు ఎమ్మెల్యే తన అనుచరులతో అన్నట్లుగా తెలిసింది.