శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 12:57:57

గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే ఫైళ్ల

గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే ఫైళ్ల

యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణ పరిధిలోని పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 13 సంవత్సరాల క్రితం చెరువు నిండిందన్నారు. ప్రస్తుతం చెరువు నిండటంతో  భూగర్భ జలాలు పెరగడంతో ఆయకట్టు పెరుగుతుందన్నారు. చెరువు నిండటంతో రైతులకు సాగు పెరుగుతుందన్నారు. మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని సంతోషంగా ఉన్నారన్నాని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.