ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 19:52:01

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో పాటు మొక్కల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో పాటు మొక్కల పంపిణీ

వరంగల్‌ అర్బన్‌ : పేద ప్రజల చికిత్సకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. చెట్టు-చెక్కు కార్యక్రమంలో భాగంగా 14 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీసులో ఆదివారం రూ.22 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులతో పాటు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్‌ కింద టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే లక్షలాదిమంది బాధితులను ఆదుకుందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అనారోగ్యంపాలైనా వారికి దీని ద్వారా సాహాయం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. చెక్కులు అందుకున్న లబ్దిదారులు అందించే మొక్కలను తప్పకుండా నాటి సంరక్షించాలన్నారు.