నల్లగొండ : గాంధీజీ అడుగుజాడల్లో మనమంతా నడవటమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ.
కుల, మతవర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఆయన అభిమతం అన్నారు. హిందూ, ముస్లింల ఐక్యత కోసం ఎంతో కషి చేశారని చెప్పారు. బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా స్వాతం త్య్రోద్యమంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. నేటి యువతరం గాంధీజీ అడుగుజాడలలో నడవాల ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.