బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 16:35:11

పరకాలలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పరకాలలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రంగల్ రూరల్ :  జిల్లాలోని పరకాల మండల కేంద్రంలో  పత్తి కొనుగోలు కేంద్రాలను  స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. హనుమాన్ కాటన్ జిన్నింగ్ మిల్లు, ధనలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలుకు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, గుడెప్పాడ్ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.