బుధవారం 03 జూన్ 2020
Telangana - May 23, 2020 , 12:58:52

కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా

కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ రూరల్ : రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుకొండ మండలంలోని మొక్కజొన్న, ధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములలోకి తరలింపులో జాప్యం చేయడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాములలో ధాన్యం దింపడానికి హమాలి కొరత ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. హమాలి సంఖ్యను పెంచాలని, అలాగే వాహనాలు వెయిటింగ్ లిస్టులో ఉండకుండా దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్దారించిన లాక్ డౌన్ నిబంధనలు అనుసరిస్తూ 'క్యూ" పద్దతిలో వాహనాలను గోదాము లోపలికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను, అధికారులను ఆదేశించారు.. అనంతరం మార్కుఫెడ్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే  సమావేశమయ్యారు. సమావేశంలో మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలవారిగా సమీక్షించారు. ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు చేయాల్సిఉంది, కొనుగోలు చేసిన ధాన్యం సెంటర్లలో ఎంత ఉంది, ఇంకా కావాల్సిన గన్ని భ్యాగులు ఎన్ని తదితర అంశాలపై ఎమ్మెల్యే  చర్చించారు.


logo