మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 12:33:44

ఎమ్మెల్యేలకు క్యాంప్‌ కార్యాలయాలు సీఎం కేసీఆర్‌ ఘనతే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఎమ్మెల్యేలకు క్యాంప్‌ కార్యాలయాలు సీఎం కేసీఆర్‌ ఘనతే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు క్యాంప్‌ కార్యాలయాలు నిర్మించిన ఘతన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో సమీకృత భవనాలు నిర్మిస్తున్న మాదిరిగానే కొత్తగా క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఈ కార్యాలయాలు ప్రజలు, అధికారులు, ఎమ్మెల్యేలకు వారధిగా ఉంటాయన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా క్యాంపు కార్యాలయానికి రావచ్చన్నారు. వారంలో ఒకరోజు జిల్లా స్థాయి అధికారులు అంతా క్యాంపు కార్యాలయంలో ఉండి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరికైనా సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైతే క్యాంప్‌ ఆఫీసులో సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.