శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 16:55:54

మానవత్వం చాటిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మానవత్వం చాటిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట : తన బర్త్ డే కు శాలువాలు, బొకేలు తోవొద్దు..ఆపదలో ఉన్నవారికి సాయపడుతూ.. నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించండని యువనేత, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ మాటలతో స్ఫూర్తి పొందిన ఎమ్మెల్యే తన మానవత్వాన్ని చాటాడు. పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి ఆపరేషన్ కోసం ఐదు లక్షలు అందజేసి..తన సహృదయతను చాటాడు.

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూగ, చెవిటి పాప వైద్య ఖర్చుల కోసం రూ.5లక్షల చెక్కును అందజేసి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన దాతృత్వం చాటుకున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, మొక్కను నాటారు. అనంతరం బాలాజీ నగర్ కు చెందిన మహ్మద్ హబీబా అనే 5 సంవత్సరాల పాప పుట్టుకతో మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్నది. ఈ నిరుపేద చిన్నారి కుటుంబంలో ఆనందాన్ని నింపేందుకు ఎమ్మెల్యే పూనుకున్నాడు. 

కేటీఆర్ పిలుపు మేరకు.. తన జీతభత్యాల నుంచి వైద్య ఖర్చులకు కావాల్సిన 5 లక్షల రూపాయలు విరాళంగా పాప కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి హబీబా తల్లి మాట్లాడుతూ.. మా పాప ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు ఖర్చవుతదని డాక్టర్లు చెప్పారు.

ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5లక్షలు, తన నెల జీతం నుంచి రూ.5లక్షలు అందించారు. ఆపదలో ఆదుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నారు. మానవీయ కోణంలో స్పందించి కేటీఆర్ మాటను నిలబెట్టిన ఎమ్మెల్యే ను పలువురు అభినందిస్తున్నారు. logo