శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 16:15:23

ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్స్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్స్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్ సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభించారు. అనంతరం ఒపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముందుగా గంగస్థాన్, పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 

ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఇది వరకే జిమ్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఎక్కువ రద్దీ దృష్ట్యా మహిళలకు ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నగర ప్రజలు ఓపెన్ జిమ్ లని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగర జనాభాకు అనుగూనంగా టాయిలెట్స్ నిర్మిస్తున్నాం.


జిల్లా కేంద్రానికి వివిధ పనుల కొరకు వచ్చే వారికి అలాగే నగర ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్స్ ని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. అలాగే శాసనసభలో నూతన రెవెన్యూ చట్టం బిల్లు సభ ఆమోదం తెలపడం చారిత్రాత్మక విషయంగా అభివర్ణించారు. కరోనా విషయంలోతగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వి పాటిల్, మున్సిపల్ అధికారులు సాగర్, శంకర్, రషీద్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ కుమార్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.logo