సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 20:23:19

మంత్రి ఈటలకు ఎమ్మెల్యే‌ బాల్క సుమన్‌ వినతి

మంత్రి ఈటలకు ఎమ్మెల్యే‌ బాల్క సుమన్‌ వినతి

హైదరాబాద్ : చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి పీహెచ్‌సీల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. చెన్నూరు మండలం అంగ్రాజ్‌పల్లి, జైపూర్ మండలం కుందారం, మందమర్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల మర్మమతులకు నిధులు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించడం మంత్రి ఈటల ఆరోగ్య కేంద్రాల భవనాల మర్మతులకు త్వరలో నిధుల విడుదల చేసేలా కృషి చేస్తానని అన్నారు. వీలైనంత నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సుమన్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.