శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 11:35:24

అనంతగిరి కొండలను కాపాడుకుందాం..

అనంతగిరి కొండలను కాపాడుకుందాం..

వికారాబాద్‌: వాళ్లిద్దరు ఎమ్మెల్యేలు. అయితేనేం.. అనంతగిరి గుట్టల్లో పర్యాటకులు పడేసిన చెత్తను ఏరివేశారు. ప్లాస్టిక్‌ కవర్‌ చేతబట్టి.. చెత్తా చెదారాన్ని జమచేశారు. ప్రకృతి అందాలకు నిలయమైన తెలంగాణ ఊటీ అనంతగిరి కొండలను కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి గుట్టల్లో వాకర్స్‌ అసోసియేషన్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ సంయుక్తంగా నిర్వహించిన ప్లోగతాన్‌-2021 కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలే యాదయ్య సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గుట్టలపై పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని, ప్లాస్టిక్‌ వేస్టేజీని ఏరివేశారు. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు వేస్టేజీని పడవేయకూడదని, అనంతగిరి కొండలను పరిశుభ్రంగా ఉంచుకుందాని సూచించారు. 


VIDEOS

logo