ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 13:06:03

మిషన్ భగీరథ పనులు పకడ్బందీగా చేపట్టాలి

మిషన్ భగీరథ పనులు పకడ్బందీగా చేపట్టాలి

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ. ఈ పథకంలో ఎక్కడా ఎలాంటి లోపాలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు చేపట్టాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోత్ బిందు అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీళ్లు రావడం లేదని, కనెక్షన్ లేదనే ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. జెడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు ఎలాంటి పరిష్కారం అందించారో చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది.

ఒక సమావేశంలో ప్రజా ప్రతినిధులు చెప్పిన సమస్యల పరిష్కారంపై నివేదిక ఇచ్చాక మరో సమావేశం అజెండా రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, సీతక్క, శంకర్ నాయక్,  కలెక్టర్ వి.పి గౌతమ్, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


logo