బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 25, 2020 , 01:47:27

ఎల్లూరు మిషన్‌ భగీరథ పనులు భేష్‌

ఎల్లూరు మిషన్‌ భగీరథ పనులు భేష్‌
  • కేంద్ర నాబార్డు జీఎంల బృందం

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: ఎల్లూరు మిషన్‌ భగీరథ పనులు భేష్‌గా ఉన్నాయని నాబార్డు జనరల్‌ మేనేజర్ల బృందం సభ్యులు పేర్కొన్నా రు. 18 రాష్ర్టాల నుంచి వచ్చిన నాబార్డు జనరల్‌ మేనేజర్లతోపాటు, కేంద్ర నాబార్డు జనరల్‌ మేనేజర్లు 20 మంది బృందం  శుక్రవా రం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండ లంలోని ఎల్లూరు  మిషన్‌ భగీరథ ప్రాజెక్టును సందర్శించారు.  నాబార్డు నిధులు రూ.200 కోట్లతో నిర్మాణం పూర్తై అమలవుతున్న రక్షిత తాగు నీటి సరఫరాను, ప్రాజెక్టుకు వివరాలను డీఈఈ నవీన్‌ బృందానికి వివరించారు. ఎల్లూరు మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నుంచి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని 3,400 గ్రామాలకు రక్షిత నీటిని అందిస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లో రన్నింగ్‌లో ఉన్న మోటర్లను పరిశీలించారు. మిషన్‌ భగీరథ బాగుందని బృందంసభ్యులు కితాబిచ్చారు. అనంతరం గోపాల్‌పేట మండలం గౌరిదేవిపల్లి, గుడిపల్లిగట్టు వద్ద భగీరథ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ స్థానిక ఈఈ సుధాకర్‌సింగ్‌, డీఈఈ అంజత్‌పాషా పాల్గొన్నారు. 


logo