సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 19:51:59

‘మినరల్‌ నీళ్ల కంటే మిషన్‌ భగీరథ నీరే సురక్షితం’

‘మినరల్‌ నీళ్ల కంటే మిషన్‌ భగీరథ నీరే సురక్షితం’

హైదరాబాద్ : మినరల్‌ నీటి కంటే మిషన్‌ భగీరథ నీరే సురక్షితమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నీటిశుద్ధి జరుగుతుందని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రజలకు  మరింత అవగాహన కల్పించాలని సూచించారు. మిషన్‌ భగీరథ పథకంపై చీఫ్‌ ఇంజినీర్లు, అన్నిజిల్లాల ఎస్‌ఈ బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న స్థిరీకరణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

డిసెంబర్‌ చివరినాటికి పనులు పూర్తి చేసి గ్రామగ్రామానికి తాగునీటి సరఫరా ప్రారంభించాలని ఆదేశించారు. రైతు వేదికలకు కూడా మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమాలకు సైతం భగీరథ నీటినే వినియోగించాలని అన్నారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్‌లోని ఆదివాసీ గూడాలు, లంబాడ తండాలకు భగీరథ నీరు సరఫరా అవుతుందని గుర్తుచేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.