మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 14:49:31

ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించాలి : మంత్రి ఎర్రబెల్లి

ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించడమే లక్ష్యంగా పని చేయాలని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు, పలు అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..అన్ని ఊర్లకు ప్రతి రోజూ నీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా స్టెబిలైజేషన్ ను చేస్తున్నామని తెలిపారు.

స్టెబిలైజేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి గ్రామానికి భగీరథ నీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ఏ ఒక్క ఇంటిని వదిలి పెట్టకుండా ప్రతి ఇంటికి నల్లాను బిగించాలని సూచించారు. గ్రామంలోని వైకుంఠ ధామాలు, డబుల్ బెడ్ రూమ్ కాలనీలకు నీటి కనెక్షన్ ఇవ్వాలన్నారు. స్టెబిలైజేషన్ లో వెనుకబడ్డ జిల్లాల చీఫ్ ఇంజినీర్లు ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేయాలని ఆదేశించారు.



logo