మిషన్ భగీరథ అద్భుతం..

మహబూబ్నగర్ : జిల్లాలో మిషన్ భగీరథ తాగునీటి పథకం అద్భుతంగా అమలవుతున్నదని జాతీయ జల జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ మండలం పోతన్పల్లి గ్రామంలో మిషన్ భగీరథపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలను సందర్శించి మిషన్ భగీరథ పనులను పరిశీలించినట్లు చెప్పారు.
గతంలో నాలుగైదు రోజులకోసారి తాగు నీరు వచ్చేదని, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ప్రతి రోజు నీళ్లు వస్తున్నాయని చాలా చోట్ల ప్రజలు చెబుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ తాగునీటి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తాగునీటి పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వృథాను అరికట్టాల్సిన విషయంలో ప్రజలు మరింత జాగ్రత్త వహించాలన్నారు.
మిషన్ భగీరథ పథకం సమాజానికి సంబంధించిన పథకమని, ప్రభుత్వం ద్వారా మనకు కల్పిస్తున్న తాగునీరు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమానికి మిషన్ భగీరథ సీఈ చెన్నారెడ్డి, కన్సల్టెంట్ స్ఫూర్తి, ఎస్ఈ వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ ఇంజినీర్ తేజబాబు, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు హాజరయ్యారు.
కాగా, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పై ఫొటో ఎగ్జిబిషన్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాజాత ద్వారా ప్రజలలో మిషన్ భగీరథ తాగునీటి వల్ల కలిగే లాభాలను, ఆర్వో వాటర్ వల్ల కలిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు కళాకారులు వివరించారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ
బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి
రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్ఎం ఏకే గుప్తా
తాజావార్తలు
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు కీలకం
- జంగుబాయి క్షేత్రం జనసంద్రం
- మాజీ సర్పంచ్ మృతికి పలువురి సంతాపం
- మిర్యాలగూడ శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి
- ఏడు పదులకుఎన్నో ఫలాలు
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్లను ఆశ్రయించాలి