ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 13:03:00

నాణ్యమైన నీటి సరఫరాకు ‘మిషన్ భగీరథ’ : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి‌

నాణ్యమైన నీటి సరఫరాకు ‘మిషన్ భగీరథ’ : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి‌

నిర్మ‌ల్ : నిర్మ‌ల్ ప‌రిధిలోని సిధ్దాపూర్ గ్రామంలో నిర్మించిన‌ పంప్‌హౌజ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఫిల్టర్‌ బెడ్ ప‌నితీరును అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింద‌న్నారు. మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించిందని, ‘మిషన్ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకుని పశ్చిమ బెంగాల్‌ సర్కారు ‘జల్‌ స్వప్న’ అనే భారీ ప్రాజెక్టును చేపడుతోందని పేర్కొన్నారు.

సిద్ధాపూర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ ప్రజలకు ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అనంత‌రం హ‌రిత‌హార కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ, నిర్మ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo