మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం

వరంగల్ అర్బన్ : మిషన్ భగీరథ నీరు అచ్చమైన స్వచ్ఛమైన జలం అని ఈ మంచి నీటితో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నదుల భూ ఉపరితలంపై నుంచి వస్తున్న శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీటిలో అన్ని రకాల లవణాలు సమపాళ్లల్లో ఉంటాయని మంత్రి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్లోని తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ బాటిల్ వాటర్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ మంచినీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం దివ్యమైన నీరుగా గుర్తింపు దక్కిందన్నారు. ఈ నీటిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తుందని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ బాటిల్ వాటర్ని కూడా సరఫరా చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ముందుగా అన్ని ప్రభుత్వ అ కార్యాలయాల్లో ఈ మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు మంత్ర పేర్కొన్నారు.
ప్రజలు శుభ్రమైన మిషన్ భగీరథ మంచి నీటిని వినియోగించాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ సీఈ శ్రీనివాసరావు, ఎస్ఈ రాములు, ఈఈలు మల్లేశం, రామాంజనేయులు, ఓ ఎస్డీ శ్రీనివాసరావు, ఏపీఎస్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
- నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్.. వీడియో వైరల్
- 4 రాష్ట్రాల ప్రయాణికులపై బెంగాల్ ఆంక్షలు
- చేపల కోసం లొల్లి.. ఎక్కడో తెలుసా?
- ఒక్క సీటు.. 131 మంది పోటీ..!
- రజనీకాంత్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది అంటే..!