సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 00:04:53

ప్రేమ ఉంటే భగీరథకు నిధులు తేవాలి

ప్రేమ ఉంటే భగీరథకు నిధులు తేవాలి

  • బీజేపీ రాష్ట్ర నాయకులకు మంత్రి ఎర్రబెల్లి సవాల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర నాయకులకు తెలంగాణపై ప్రేమ ఉంటే మిషన్‌భగీరథ పథకానికి కేంద్రం నుంచి నిధులు తేవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మిషన్‌ భగీరథను కేంద్రం అభినందించిన నేపథ్యంలో శనివారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథ అన్నిరాష్ర్టాలకు మార్గదర్శిగా నిలిచిం దని చెప్పిన జాతీయ జల్‌జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ సాహాకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో మిషన్‌ భగీరథ విజయవంతంగా అమలవుతున్నదనడానికి నీతి ఆయోగ్‌, 15వ ఆర్థిక సం ఘం, శాస్త్రవేత్తలు, వివిధ రాష్ర్టాలు సహా ప్రధాని ప్రశంసలే నిదర్శనమని చెప్పారు. ప్రశంసలే తప్ప కేంద్రం నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. 


logo