శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 21:08:56

గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యం

గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యం

దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు  లభ్యమయ్యాయి. ములకపాడు గ్రామానికి చెందిన చినిగిరి అభిషేక్‌(16), నిట్టా సాయికుమార్‌(18)లు సీతారాంపురం గ్రామంలో సాయంత్రం ఓ శుభకార్యానికి వెళ్లారు. అనంతరం స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి వెళ్లగా వారికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యారు. ఈ విషయం శుభకార్యంలో ఉన్నవారికి ఎవరికీ తెలియలేదు.  గోదావరి నీటిలో మృతదేహాలు తేలడంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. logo