గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 17:32:56

ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకి లభ్యం

ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకి లభ్యం

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యమైంది. అప్పుడే పుట్టిన శిశువు మూడు రోజుల క్రితం అస్పత్రి నుంచి దుండగులు ఎత్తుకెళ్లారు. మణుగూరులో పసికందు ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


logo