మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 10:50:32

భూపాలపల్లి కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం..

భూపాలపల్లి కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం..

జయశంకర్ భూపాలపల్లి : కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీంకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఆయన రేగొండ మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి ప్రభుత్వ వాహనంలో బయలుదేరారు. రేగొండ మండలం రామన్నగూడెం తండా సమీపంలో ప్రధాన రోడ్డుపై అకస్మాత్తుగా ద్విచక్ర వాహనదారుడు అడ్డురావడంతో కలెక్టర్‌ వాహనం డ్రైవర్‌ అప్రమత్తమై తప్పించేందుకు బ్రేక్‌ వేసి రోడ్డు కిందకు తీసుకెళ్లారు. వాహనదారుడితో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న కలెక్టర్‌తో సహా సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే రేగొండ పోలీసులకు సమాచారం అందించగా.. సదరు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo