ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 08:49:16

మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తులకు గడువు పొడిగింపు

మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తులకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌ : తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని  మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. ఆ పాఠశాలలో శనివారం తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. 5వ తరగతిలో చేరే విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలని, 9618895460, 7995057879లను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


logo