బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 01:11:39

మైనార్టీలకు మరింత భరోసా

మైనార్టీలకు మరింత భరోసా
  • సంక్షేమం కోసం రూ.1,518 కోట్లు కేటాయింపు
  • గతంలోకంటే రూ.150 కోట్లు అదనం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. వారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.1518.06 కోట్లు కేటాయించింది. క్రితంసారితో పోలిస్తే ఈసారి  రూ.150 కోట్లు అదనం. మైనార్టీ విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు 204 గురుకులాలను ఏర్పాటుచేసింది. ఈ ఏడాదినుంచి గురుకులాలను జూనియర్‌కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమాం, మౌజన్‌లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవభృతిని అందిస్తున్నది. రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు కొత్తబట్టలు పంపిణీచేసి వారిలో ఆనందాన్ని నింపుతున్నది. మైనార్టీ యువత స్వయంఉపాధికోసం అనేక ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. అనాథ మైనార్టీ పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు నాంపల్లిలో అనీస్‌ ఉల్‌ గుర్బా భవనాన్ని నిర్మిస్తున్నది. ప్రతి ఏడాది హజ్‌యాత్ర కోసం కోట్ల రూపాయలను కేటాయిస్తున్నది. 
logo