చిన్నపాటి సైడ్ఎఫెక్ట్స్ సహజం

ఏ టీకా తీసుకున్నా చిన్నపాటి దుష్ప్రభావాలు ఎదురవడం సహజం. ఐఎం ఇంజెక్షన్‌తో టీకా వేయడం వల్ల శరీరంలో కొన్ని కెమికల్స్ విడుదలవుతాయి. ఫలితంగా నొప్పి, వాపు, జ్వరం వంటివి వస్తాయి. దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమందికి శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి. దుష్ప్రభావాలేవైనా ఉంటే 48గంటల్లోనే బయటపడతాయి. కరోనా వ్యాక్సిన్లు కొత్తవి కావడం వల్ల అప్రమత్తంగా ఉండడం మంచిది.
- డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, నిమ్స్ హాస్పిటల్ ఫార్మకాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, కొవాగ్జిన్ టీకా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్
----------------------------------------------
మూడు నెలలపాటు గర్భధారణ వద్దు
టీకా వేసుకున్న మరుసటి రోజు మద్యం తాగొచ్చు
టీకా వేసుకున్న తరువాత 28 రోజులకు ప్రతిరక్షకాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గర్భధారణ జరిగితే టీకా వల్ల (ఒకవేళ ఏర్పడితే) దుష్ప్రభావాలు పుట్టబోయే బిడ్డపై పడే అవకాశం ఉంటుంది. గర్భిణులపై క్లినికల్ ట్రయల్స్ జరుగలేదు. అందుకే గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు టీకాలు వేయడం లేదు. టీకా తీసుకున్నవారు దాంపత్య జీవితంలో పాల్గొనవచ్చు. కానీ మూడు నెలలవరకు గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ ఏ బ్రాండ్ తీసుకున్నా ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మద్యం సేవించిన తరువాత టీకా వేసుకోవద్దు. టీకా వేసుకున్న వెంటనే మద్యం తాగొద్దు. టీకా వేసుకొన్న వారికి ఎలాంటి ఆహార నియమాలు లేవు. మరుసటి రోజు మద్యం కూడా తాగొచ్చు. టీకా వేసుకున్న మహిళలు మూడు నెలల వరకు గర్భధారణకు దూరంగా ఉండాలి.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు