సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 19:38:06

మైనర్ బాలికపై లైంగికదాడి..

మైనర్ బాలికపై లైంగికదాడి..

సిరిసిల్ల రూరల్ : మైనర్ బాలికపై మూడేళ్లుగా ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. మండలంలోని మండెపెల్లి మోడల్‌ స్కూల్‌లో పార్ట్ టైం టీచర్‌గా పనిచేస్తున్న అవునూరి రమేశ్‌ గతంలో అదే పాఠశాలలో చదివిన బాలికతో సన్నిహితం పెంచుకున్నాడు.

ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకొని కొన్నాళ్లుగా అకృత్యానికి పాల్పడుతున్నాడు. ప్రస్తుతం బాలిక ఇంటర్ చదువుతోంది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో తంగళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అభిలాశ్‌ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.