గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 19:19:12

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్‌ : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు మంత్రులు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

విజయదశమి పర్వదినం సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ఈ సంవత్సరంలో విజయాలు చేకూరాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని వారు సూచించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.