ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 16:29:33

నర్సాపూర్ కు రేపు సీఎం కేసీఆర్..ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

నర్సాపూర్ కు రేపు సీఎం కేసీఆర్..ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్ : ఆరో విడత హరితహార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్‌రావు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం అర్బన్‌ ఫారెస్ట్  పార్కులో మొక్కలు నాటి, హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ, డీఎఫ్ఓలు తదితరులున్నారు.logo