శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 12:35:34

‘నాణ్యత నిర్ధారణ’ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

‘నాణ్యత నిర్ధారణ’ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

కరీంనగర్:  జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. తలసానికి ఎల్ఎండీ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వర్షం కారణంగా ఎల్ఎండీలో పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ ప్రారంభ కార్యక్రమం రద్దు అయింది. కరీంనగర్ లో ఘనీకృత పశు వీర్య ఉత్పత్తి కేంద్రంలో నాణ్యత నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని  మంత్రులు ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo