బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 12:27:55

భ‌ద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

భ‌ద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

వరంగల్‌ అర్బన్‌ : జిల్లా పర్యటనలో భాగంగా దేవాదాయ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్‌ భాస్కర్‌ బుధవారం భ‌ద్రకాళి అమ్మవారిన దర్శించుకున్నారు. ఆల‌య పూజారులు మంత్రులు, చీఫ్ విప్‌కు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యే పూజ‌లు చేశారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, గుండు సుధారాణి, మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే ఆరూరి రమేప్ తదితరులు ఉన్నారు.