గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 15:42:52

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు

మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా దోపిడీకి గురైందని భావించి ప్రజలు ఉద్యమించాలని జై శంకర్ సార్ పిలుపునిచ్చారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇంచార్జ్ ఆర్ జేసీ కృష్ణ, పలువురు టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.logo