బుధవారం 08 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 13:35:27

కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల భేటీ

కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పరిధి కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చామకూర మల్లారెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బోర్డు సభ్యులతో కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సమావేశంలో మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, కంటోన్మెంట్‌ సీఈఓ చంద్రశేఖర్‌, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జీ మర్రి రాజశేఖర్‌ రెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.logo